ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించాలని ఆరాటపడుతూంటారు.

పిల్లలకు చిన్నతనంలో నేర్పించే అలవాట్లే... పెద్దయ్యాక వారికి మంచి పేరు తెచ్చిపెడతాయి.

మనం నేర్పించే అలవాట్లే వారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయని చాలా మంది భావిస్తారు.

మనం నేర్పించే అలవాట్లలో కచ్చితంగా దయాగుణం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

దయాగుణం అనేది ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడే సామర్థ్యం.

అందుకే పిల్లలకు సానుభూతి, దయాగుణం నేర్పించడం ముఖ్యం.

తమ పిల్లల్లోని సానుభూతి గుణం ఇతరులకు మేలు చేస్తుందని తల్లిదండ్రులు నమ్ముతారు.

దయాగుణం వల్ల పిల్లల్లో క్లిష్టమైన సమయాల్లో ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. 

మెదడు తనంతట తానుగా ప్రతిదీ చేస్తుందనే ఆలోచనకు సైన్స్ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు.

తల్లిందండ్రులు చేసే రోజువారీ సానుభూతి పనులను పిల్లలు గమనిస్తారు. 

పిల్లల మెదడులోకి చేరిన ఆ అంశాలలో కొన్ని పనులను నేర్చుకుంటారట.

పిల్లలు.. ఆరు నెలల వయసు నుంచే చుట్టూ జరిగే విషయాలను పరిశీలిస్తూ ఉంటారు.

మనం ఇంటికి వచ్చిన వారితో మన ప్రవర్తించే ప్రతిదీ పిల్లలపై ప్రభావం చూపుతుంది.

పిల్లల వ్యక్తిత్వం.. తమ తల్లిదండ్రుల దగ్గర నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు

పిల్లలు స్వతహాగా నేర్చుకుంటారు అని వదిలేయకూడదు.

తల్లిదండ్రులు కొన్ని కొన్ని పనుల ద్వారా పిల్లలకు  మంచి అలవాట్లు స్వయంగా నేర్పించాలి.

తల్లిండ్రులు నేర్పించే మంచి అలవాట్లతో పెరిగిన పిల్లలో సమాజానికి ఎంతో మేలు చేస్తారు.