అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు 41 రోజులు శ్రద్ధా భక్తులతో, కఠిన నియమాలతో స్వామిని పూజిస్తారు.
ఈ ఆలయానికి వచ్చే ప్రతి పురుషుడు నలుపు లేదా నీలి రంగు వస్ర్తాలు ధరిస్తారు.
అలాగే విభూతి, గంధంతో కలిపి బొట్టు పెట్టుకోవడం ఈ మాలధారణ నియమం.
నిత్యం ఆ స్వామి నామస్మరణలోనే మాల ధరించి భక్తులు ఉండాలి
అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తులు నియమ, నిష్టలతో స్వామి వారిని పూజించాలి.
మాలధారణ ఉన్న సమయంలో నోటి వెంటే అశుద్ధ మాటలు పలుకరాదు.
అందుకోసం ప్రతి మనిషిలోనూ అయ్యప్ప భక్తులు దైవాన్ని చూస్తారంట.
అందుకు అందుకే అయ్యప్ప భక్తులు ఒక్కర్ని ఒకరు స్వామి అని పిలుచుకుంటారు.
మాల ధరించిన ప్రతి భక్తుడు ఇరుముడి తీసుకుని శబరిమల చేరుకుంటాడు.
ఈ ఇరుముడిలో కొబ్బరికాయలో నెయ్యిని నింపుకుని తీసుకుని వచ్చి ఇక్కడ స్వామికి సమర్పిస్తారు.
శబరిమల ప్రసాదాన్ని అరవన ప్రసాదం, అప్పం అంటారు.
ఈ ప్రసాదాన్ని బియ్యం, నెయ్యి, చక్కెర, బెల్లం ఉపయోగించి తయారు చేస్తారు.