ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న చంద్ర గ్రహణం రానే వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న చంద్ర గ్రహణం రానే వచ్చింది.

మంగళవారం వివిధ ప్రాంతాల్లో వారి వారి కాలమానాల ప్రకారం చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

ఈ మధ్యాహ్నం 2.39 గంటలకు మొదలై సాయంత్రం 6. 30 వరకు ఉండనుంది. 

ఇక, దేశంలో 5.32నుంచి 6.18వరకు దాదాపు 45 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనుందని సమాచారం.

చాలా ప్రాంతాల్లో చంద్రోదయం అనంతరం గ్రహణం చూసే అవకాశం ఉంది. 

కోల్‌కతాలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు. 

ఇంత సుధీర్ఘ కాలం చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని అంటున్నారు. 

ఇక, హిందువుల నమ్మకాల ప్రకారం గ్రహణ సమయంలోని సూత కాలంలో ఏ కొత్త పని మొదలుపెట్టరు.

ఇంట్లో ఉండటానికి సుముఖత వ్యక్తం చేస్తారు. పంచాగాలు ప్రకారం చంద్ర గ్రహణ సూతకాలం 9.21 గంటల నుంచి ప్రారంభమై 6.18 వరకు ఉండనుంది. 

పిల్లలు, వృద్ధులు, అనారోగ్యం కలిగిన వారికి సూతకాలం మధ్యాహ్నం 2.48నుంచి మొదలై సాయంత్రం 6.18వరకు ఉండనుంది.

మీరు ఒకవేళ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చూడాలనుకుంటే అందుకోసం కొన్ని సైట్లు ఉన్నాయి. 

వాటిలో మీరు లైవ్‌లో చంద్రగ్రహాణాన్ని చూడొచ్చు.