టీమిండియా క్రికెటర్లు ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

టీమిండియా మాజీ ప్లేయర్‌, ప్రస్తుత టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎంబీఏ చేశారు.

టీమిండియా మాజీ క్రికెటర్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు.

టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ డిగ్రీ పూర్తి చేశారు.

దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ ఇంటర్మీడియట్‌ వరకే చదువుకున్నారు.

టీమిండియా మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

ఇక టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇంటర్మీడియట్‌ కంప్లీట్‌ చేశాడు.

ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు.

స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.

ఇక స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కేవలం తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.

మరి క్రికెటర్ల చదువులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.