ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది.

ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, మరో 11 మంది అధికారులు మరణించారు.

బిపిన్ రావత్ ప్రయాణించిన MI-17V5 ఎంత వరకు సురక్షితమో, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన MI-17V5 హెలికాప్టర్ ఎంతో సురక్షితమైనదిగా పేరుంది.

ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటనలకు కూడా దీనినే వాడుతున్నారు.

సైనిక రవాణాకు వినియోగించే MI8 నుంచి ఈ హెలికాప్టర్ ను అభివృద్ధి చేశారు. 

ఎలాంటి వాతావరణంలోనైనా ప్రాయణించగలగడం దీని ప్రత్యేకత. ఎడరాలు, అడవులు, సముద్రాలపై సురక్షితంగా ప్రయాణించేలా తయారు చేశారు.

ఇది దాదాపు 36 మంది సైనికులు లేదా 4.5 టన్నుల బరువును రవాణా చేయగలదు.

దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇంధన ట్యాంక్ పేలినా కూడా మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్ అనే సింథటిక్ ఫోమ్ రక్షణ కవచంగా ఉంటుంది.

ఇది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలో మీటర్లు ప్రయాణించగలదు.

రష్యాకు చెందిన రోసోబోర్న్ ఎక్స్ పోర్టు నుంచి 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది.

2008 నుంచి 2013 కల్లా 80 హెలికాప్టర్లను డెలివరీ చేశారు. ఈ హెలికాప్టర్ల వల్ల అత్యంత భారీ ప్రమాదాలేవీ జరిగిన దాఖలాలు లేవు.