ఈ డిజిటల్‌ యుగంలో నిద్ర లేచింది మొదలు.. పడుకునే వరకు ప్రతి ఒక్కరు మొబైల్‌ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు.

లేవగానే మొబైల్‌ చేతిలోకి తీసుకోవడం.. గంట, అరగంట దానిలో మునిగిపోవడం చేస్తుంటారు.

దీనివల్ల సమయం వృథా కావడమే కాక.. రోజంతా నిరుత్సాహంగా ఉంటారు అంటున్నారు నిపుణులు.

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులు చేస్తే మంచిది అంటున్నారు నిపుణులు. అవేంటంటే

నిద్రలేచిన వెంటనే.. రెండు గ్లాస్‌ల నీరు తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

బ్రష్‌ చేసుకుని, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఓ మైలు దూరం జాగింగ్‌ చేయండి.

దీనివల్ల కండరాలకు శక్తి చేకూరడమే కాక.. శరీరం ఫిట్‌గా ఉంటుంది.. మెదడు కూడా చురుగ్గా పని చేస్తుంది.

ఆ తర్వాత కాసేపు ప్రాణాయామం, యోగా చేయండి. దీని ద్వారా కొద్ది కాలంలోనే మీలో ఒత్తిడి తగ్గడమేకాక.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు, ఊపిరి సులువుగా తీసుకునేందుకు ప్రతి రోజు ఉదయం ఆవిరి పట్టుకోవడం మేలు.

ఉదయాన్నే.. ఈ రోజు చేయాల్సిన పనులను ఓ చోట రాసుకొండి. ప్రాధాన్యతలు గుర్తిస్తూ వెళ్లి.. దాని ప్రకారం పూర్తి చేయండి.

ఎంత బిజీగా ఉన్నా సరే.. ఉదయం టిఫిన్‌ చేయడం మాత్రం మానకూడదు. 

సమయానికి భోజనం చేస్తేనే.. పనులన్నింటిని అనుకున్న గడువులోగా పూర్తి చేయగలరు.

మీ రోజుని ఆత్మవిశ్వాసం, సంతోషంతో ప్రారంభించండి. తప్పక విజయం సాధిస్తారు అంటున్నారు నిపుణులు.