వైద్య శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేసినా.. ఎంత ప్రగతి సాధించినా సరే.. క్యాన్సర్‌ను ఎదుర్కొనే విషయంలో మాత్రం వెనకబడే ఉన్నాం.
నేటి కూడా క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స విధానం లేదు.
క్యాన్సర్ బారిన పడ్డామంటే.. చాలా కష్టమైన చికిత్సను ఎదుర్కోవాల్సిందే.
క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికి.. పూర్తి ఆరోగ్యవంతులు కావాలంటే.. చాలా సమయం పడుతుంది.
క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత చికిత్స గురించి ఆలోచించే బదులు.. ముందే నివారణ చర్యలు తీసుకోవడం మేలు.
క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా మంచి ఆహారం, వ్యాయామం జీవితంలో భాగం చేసుకోవాలి.
సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. అలానే మన జీవనశైలీలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.
క్యాన్సర్ కారకాల్లో మన కిచెన్‌లో వాడే కొన్ని వస్తువులు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా.
మన వంట గదిలో ఉన్న కొన్ని వస్తువులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్లాస్టిక్ డబ్బాలు చూడగానే కలర్‌ఫుల్‌గా, విభిన్న ఆకృతిలో ఆకట్టుకుంటాయి.
కానీ వీటి వల్ల మనుషులకు, పర్యావరణానికి ఎంతో కీడు. ఇవి క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయి అంటున్నారు.
ప్లాస్టిక్ డబ్బాలలో కనిపించే BPA( బిస్ఫినాల్స్ A) మీ సహజ హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది అంటున్నారు వైద్యులు.
అలానే ఈమధ్య కాలంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా నాన్ స్టిక్ పాన్‌ల వినియోగం పెరిగిపోయింది.
అయితే వీటిల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
మరీ ముఖ్యంగా వీటిల్లో పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (పీఎఫ్‌ఓఏ) ఉంటుంది. నాన్ స్టిక్ పాత్రలను వేడి చేయడం ద్వారా.. అవి విడుదల అవుతాయి.
ఇవి పలు రకాల క్యాన్సర్లకు దారి తీస్తాయి అంటున్నారు నిపుణులు.
మరీ ముఖ్యంగా అండాశయాలు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.
అలానే చాలా మంది వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ మూతలున్న డబ్బాల్లో స్టోర్ చేస్తుంటారు
అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాండి డబ్బాల్లో వేడి ఆహారాన్ని ప్యాక్ చేస్తే.. దానిలో ఉండే బీపీఏతో చర్య జరిపి ప్రమాదం కలిగిస్తుంది.
రిఫైన్డ్ ఆయిల్ వాడకం వల్ల ట్రాన్స్‌ఫ్యాట్ బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
అలానే ప్రాసెస్ చేసిన మాంసం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికం అంటున్నారు.
ఇక చాలా మంది కూరగాయాలు తరగడానికి ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డులు వాడుతుంటారు. వీటి వల్ల కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు మీ శరీరంలోకి చేరి క్యాన్సర్ కలిగించే అవకాశం ఉంది.
అలానే మనం వాడే సబ్బులు, క్లీనర్లు థాలేట్స్, పారాబెన్లు, సల్ఫేట్స్ కలిగి ఉండే సబ్బులు క్యాన్సర్‌కు కారణమయ్యే ఏజెంట్లు అంటున్నారు నిపుణులు.