కొంతమందికి గెలుపు అనివార్యం కాకపోయినా.. మొండిగా గెలుపు సాధించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తారు.

రాశులను బట్టి కూడా అలాంటి మొండి ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఈ కింది రాశుల వారు గెలుపు కోసం ఎంత వరకైనా వెళతారు.

మేషం : వీరు ప్రతీ విషయంలోనూ కాంపిటీషన్‌ను కోరుకుంటారు. గెలవటం అంటే వీరికి ఎంతో ఇష్టం

వీరు ఏవిషయంలోనైనా ఓడిపోతే తీవ్రమైన కోపానికి గురవుతారు.

సింహం : ఈ రాశికి చెందిన వారు కూడా ఓడిపోవటాన్ని అస్సలు తట్టుకోలేరు.

తమకు ఇష్టమైన వాటిలో ఓటమి అంటే ప్రాణం పోయినట్లుగా భావిస్తారు.

వృశ్చికం : ఈ రాశి వారు ప్రతీ కాంపిటీషన్‌ను చావు బతుకుల సమస్యగా భావిస్తారు.

ఓడిపోతే తట్టుకోలేరు. తమను ఓడించినవారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు.

మకరరాశి : వీళ్లు కష్టాన్ని ఎక్కువ నమ్ముకుంటారు.

అనుకున్న దాంట్లో ఓటమి వస్తే మాత్రం తట్టుకోలేరు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.

ధనస్సు : ఈ రాశుల వారికి కూడా గెలుపంటే మహా ఇష్టం. గెలవటానికి ఎంతటి రిస్క్‌నైనా తీసుకుంటారు.

ఓటమి ఎదురైతే మాత్రం ఫ్రష్టేట్‌ అవుతూ ఉంటారు.