పెట్రోల్‌ బంక్‌కు ఎందుకు వెళ్తాం అంటే.. ఇదేం ప్రశ్న.. పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించడానికే వెళ్తాం.. ఇంకేం చేస్తాం అంటారా.

అయితే పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు కొన్ని ఉచిత సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

మరీ ముఖ్యంగా పెట్రోల్‌ బంకుల్లో ఆరురకాల సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

పెట్రోల్‌ బంకు పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో.. ఈ ఆరు సేవలు కచ్చితంగా కల్పిస్తాం అని చెబితేనే ప్రభుత్వం అనుమతి లభిస్తుంది.

ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంచకపోతే.. సదరు కంపెనీ మీద ఫిర్యాదు చేయవచ్చు.

ఈ ఆరు ఉచిత సేవల్లో ప్రధానమైంది.. ఫ్రీ మంచి నీటి సరఫరా.

పెట్రోల్‌ బంక్‌కు వచ్చే వారికి ఉచితంగా తాగు నీరు అందించాలి.

ఇందుకోసం బంక్‌లో ఆరో మెషన్‌, వాటర్‌ కనెక్షన్‌ యూనిట్‌ పొందాలి.

అలానే ప్రతి పెట్రోల్‌ బంక్‌లో మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలి.

ఇందుకు సంబంధించి తాజాగా కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది.

మనం లీటర్‌ పెట్రోల్‌ మీద చెల్లించే డబ్బుల్లో 4-8 పైసలు టాయిలెట్‌ నిర్వహణకు వినియోగిస్తారు.

పెట్రోల్‌ బంకుల్లో సాధారణంగా నాణ్యతకు సంబంధించిన మోసాలు వెలుగు చూస్తాయి.

కనుక ప్రతి వినియోగదారుడికి బంకుల్లో విక్రయించే పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యత గురించి తెలుసుకునే హక్కు ఉంది.

అలానే పెట్రోల్‌ బంకుకు వచ్చే టూవీలర్స్‌, త్రీ వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ ఇలా అన్ని వాహనాలకు ఉచితంగా గాలి కొట్టే సౌకర్యం పెట్రోల్‌ బంకే కల్పించాలి.

ప్రస్తుతం చాలా పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కొట్టడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు.

అలానే ప్రతి పెట్రోల్‌ బంక్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ ఉండాలి.

ఎప్పుడైనా బంకుల్లో అనుకోని ప్రమాదాలు జరిగి.. ఎవరైనా గాయపడితే.. వారికి తక్షణం ప్రాథమిక చికత్స అందించడం బంక్‌ బాధ్యత.

అందుకే ప్రతి బంక్‌లో కచ్చితంగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ అందుబాటులో ఉండాలి.

అలానే పెట్రోల్‌ బంక్‌కు వచ్చే వారికి ఉచిత ఫోన్‌ సౌకర్యం కల్పించాలి.

బంక్‌కు వచ్చిన కస్టమర్లు ఎవరికైనా కాల్‌ చేసుకోవడం కోసం బంకు యాజమాన్యమే ఫోన్‌ అందుబాటులో ఉంచాలి.

పెట్రోల్‌ బంకుల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో లేకపోతే.. సదరు బంక్‌ మీద ఫిర్యాదు చేయవచ్చు.