ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల సూర్యుడు కిరణాలు శరీరాన్ని వెచ్చగా తాకుతున్నాయి.

ఈ కిరణాల  తాకడం వల్ల కొంత మంది చర్మం ఎర్రగా కావడం, బొబ్బలు రావడం జరుగుతుంటాయి. దీన్నే సన్ బర్న్ అని కూడా ఉంటారు. 

ఇందుకు కారణం సూర్య రశ్మిలో ఉండే అతి నీలలోహిత కిరణాలు.  ఇది చర్మ కణాలను దెబ్బతీస్తుంది, వాపుకు కారణమవుతుంది. క్యాన్సర్‌కు కూడా దారి తీయోచ్చుు.

ఈ వేసవిలో సన్ బర్న్ నుండి బయట పడాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు

బయటకు తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే వెళ్లాలి. చేతులకు పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. 

గొడుగు లేదా టోపీ వంటివి వినియోగించాలి. కాటన్ దుస్తులు మాత్రమే వినియోగించాలి.

నల్లటి దుస్తులు ధరించకూడదు. అలాగే కళ్లకు సన్ లేదా కూలింగ్ గ్లాస్ అద్దాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

ఎండ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి. 

ఎండ తగులుతున్న చోట తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండ నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.

 అలాగే నీరు ఎక్కువగా తీసుకోవాలి. బాడీ డీ హైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలి. చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసుకోవాలి.

ఆయిల్ ఫుడ్‌కు దూరంగా, ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఇబ్బంది పెడుతుంటే నీటిలో సేదతీరడం, ఈత కొట్టడం, ఆడుకోవడం ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ, దీని వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ అవుతాయని గుర్తుంచుకోవాలి. 

పెదాలు పొడిబారుతూ ఉన్నట్లయితే లిప్ బామ్ వాడాలి. పెదాలను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి.

లాలాజలాన్ని పెదాలపై రాయోద్దని, అలా చేస్తే మరింత ఎక్కువ పెదాలు పొడి బార వచ్చునని చెబుతున్నారు.