ఆరోగ్యంగా ఉండేందుకు డ్రైఫ్రూట్స్‌ని ఆహారంలో భాగంగా తీసుకుంటారు చాలామంది.

డ్రై ఫ్రూట్స్‌ను ప్రతి రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందడటమే కాక.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అయితే వీటిలో కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ని నానబెట్టి తినాల్సి ఉంటుంది. 

అలా నానబెట్టి తినాల్సిన డ్రైఫ్రూట్స్‌ని పచ్చిగా అసలు తినకూడదు అంటున్నారు నిపుణులు. 

మరి ఇలా నానబెట్టి తినాల్సిన డ్రైఫ్రూట్స్‌ ఏవంటే.. 

ఎండుద్రాక్షల్లోని ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు. వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. 

ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  కనుక వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి.

ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎసిడిటీ సమస్య కూడా దూరమవుతుంది అంటున్నారు.

ఎంతో రుచికరంగా ఉండే డ్రైఫ్రూట్స్‌లో  ఫిగ్‌ ఒకటి. దీనిలో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

అలాగే దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, గుడ్‌ కొలెస్ట్రాల్ ఉంటాయి. 

అయితే దీనిలోని పోషకాలు మనకు పూర్తిగా అందాలంటే.. మాత్రం వీటిని ఖచ్చితంగా నానబెట్టే తినాలి. లేదంటే ప్రమాదం అంటున్నారు నిపుణులు.

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది వరం అని చెప్పవచ్చు.

అలాగే ఖర్జురాల్లో పుష్కలంగా ఉండే పొటాషియం నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

అయితే ఖర్జుర నుంచి లభించే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే వీటిని నానబెట్టే తినాలి అంటున్నారు నిపుణులు. 

మన ఆరోగ్యానికి మేలు చేసే డ్రైఫ్రూట్స్‌లో బాదం పప్పులు ప్రథమ వరుసలో ఉంటాయి. 

వీటిని తినడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ , పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా లభిస్తాయి.

అయితే బాదం పప్పులను పచ్చిగా  కాకుండా నానబెట్టి తినడమే మంచిది అంటున్నారు నిపుణులు. 

నానబెట్టి తింటేనే వాటిలో ఉండే పోషాకాలన్నీ మనకు అంది.. ఆరోగ్యం బాగుంటుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు.