మన దేశంలో దేవుళ్లను పూజించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొంత మంది అభిమానులు తాము అభిమానించే వారికి ఆలయాలు నిర్మిస్తారు.. అలాంటి సినీ, రాజకీయ సెలబ్రెటీలకు కూడా ఉన్నాయి.
1936లో వారణాసిలో మహాత్మా గాంధీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో భరతమాత విగ్రహం ఉండదు. పాలరాయితో తయారు చేసిన భారతదేశం యొక్క మ్యాప్ ఉంటుంది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మహనీయులకు నివాళిగా దీనిని పేర్కొంటారు.
ఉజ్జయినలో విస్కీదేవి కాలభైరవ్ ఆలయం
ఉజ్జయినీలోని కాల భైరవ్ ఆలయానికి భక్తులు మద్యం సీసాలను తీసుకు వెళ్తారు. ఈ ఆలయాన్ని విస్కీదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. ఆలయం బయట విక్రయించే పూజాసామాగ్రిలో కొబ్బరికాయలు, పువ్వులతో పాటు 140 మి.లీ మద్యం కూడా ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వమే వీటిని సరఫరా చేస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే..2 మిషాల్లోనే ఈ ఆలయంలోని విగ్రహం క్వార్టర్ మద్యం ఖాళీ చేస్తుంది.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ సమీపంలో 'బుల్లెట్ బాబా' ఆలయం ఉంది. ఈ ఆలయం ఓం బన్నా అనే వ్యక్తికి అంకితం చేయబడింది.రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ వాహనం ఇక్కడ పూజలందుకునే స్వామి. బాబా దర్శనం చేసుకోకుండా వెళితే సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకోలేకపోవచ్చని ప్రజలు చెబుతుంటారు.
తెలంగాణ మహబూబ్ నగర్ లో సోనియా గాంధీ ఆలయం ఉంది. కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మందిరాన్ని నిర్మించాడు. పాలరాతితో ఈ విగ్రహం తయారు చేశారు. ఆలయం బయట గోడలపై ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చిత్ర పటాలు ఉంచారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే అభిమానించేవారు ఎంతో మంది ఉన్నారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఒక ఆలయం ఉంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆలయంలో మోడీ విగ్రహానికి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.
బాలీవుడ్ లో సూపర్ స్టార్ అమితాబచ్చన్ అంటే యావత్ భారత దేశం అభిమానిస్తారు. కలకత్తాలోని అమితాబ్ కు ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలోని పలకలపై శ్రీ అమితాభా అనే మంత్రాలు కూడా చెక్కబడి ఉంటాయి. ఆయనకు ప్రత్యేకంగా ప్రార్ధనలు చేయడానికి కొన్ని ప్రత్యేక తేదీలను కూడా అనుసరిస్తారు.