గుండెపోటు.. ఈ సమస్యతో గత కొన్ని రోజుల నుంచి చాలా మంది చనిపోతున్నారు.

వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చాలా మందిని ఈ సమస్య వెంటాడుతోంది.

అసలు గుండెపోటు వచ్చే ముందే కనిపించే లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెకు రక్త సరఫరా తగ్గినట్లైతే గుండెలో మంటలా వస్తుంది. ఎంతకూ తగ్గకుండా దగ్గు, జ్వరం వస్తుంటే అది గుండెపోటు లక్షణంగా చెప్పవచ్చు.

గుండెనొప్పికి ముందు శ్వాస తీసుకోడం భారంగా అనిపించడం కూడా ఒక లక్షణంగా గుర్తించడం. 

అప్పుడప్పుడు మత్తుగా అనిపించడం, శరీరమంతా చెమటలు పట్టడం. 

కాళ్ల పాదాలు, మడమలకు వాపు వస్తుంటే గుండెపోటు లక్షణంగా గుర్తించవచ్చు. గ్యాస్, అజీర్థి, ఆహారం జీర్ణం కాకపోవడం.

గొంతు, దవడలు నొప్పిగా అనిపించడం. ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం, గందరగోళానికి గురి కావడం. 

శరీరం పై భాగం నుంచి ఎడమ చేతికి కింద భాగం వరకు నొప్పిగా అనిపించడం. 

ఇలాంటి లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి గుండెపోటును బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.