కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోల్,  డీజిల్ పై  ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ లో తగ్గింపును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎంత రేటు తగ్గించాయో ఇప్పుడు చూద్దాం.

ఒడిశా ప్రభుత్వం గురువారం పెట్రోల్,  డీజిల్ పై   లీటరుకు రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నవంబర్ 5 నుండి  అమలులోకి వస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెట్రోల్, డీజిల్ పై  వ్యాట్ ధరలను 5.5 శాతం తగ్గించినట్లు ప్రకటించారు. సవరించిన వ్యాట్ ధరలు నవంబర్ 5 అర్ధరాత్రి నుండి  వర్తిస్తాయి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  వ్యాట్ లో నాలుగు శాతం సెస్లో   రూ.1.50 తగ్గింపుప్రకటించారు. ఫలితంగా ఇక్కడ పెట్రోల్ ధర  రూ.106.86, డీజిల్ ధర రూ.90.95 కి దిగోచ్చింది.

నాగాలాండ్ ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్ పై  లీటరుకు రూ.7 చొప్పున

చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ గురువారం నవంబర్ 4 అర్ధరాత్రి నుండి పెట్రోల్, డీజిల్ పై  వ్యాట్ను  రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది .

పెట్రోల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) లీటరుకు రూ.2, డీజిల్ పై  రూ.4.60 తగ్గిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో.. ఇక్కడ  పెట్రోల్ లీటరుకు  రూ.12 తగ్గగా , డీజిల్ కూడా లీటరుకు  రూ.17 తగ్గింది.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్  ధరలను లీటరుకు రూ.7 అదనంగా తగ్గిం

 పుదుచ్చేరిలోని AINRC నేతృత్వంలోని NDA ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్ పై  విలువ ఆధారిత పన్నుని లీటరుకు  రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది

డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.

 పెట్రోల్, డీజిల్ పై  సేల్స్ ట్యాక్స్ ను తగ్గించిన తొలి రాష్ట్రం కర్ణాటక. ఇక్క పెట్రోల్ ధర రూ.104.50 నుండి  రూ.85.03కి తగ్గింది. అంటే.. ఒక్కసారిగా  రూ.19.47 తగ్గిందనమాట.

మిజోరం ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.7 చొప్పున తగ్గించింది. 

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం పెట్రోల్, డీజిల్ పై  విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని రూ.12 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు .

గుజరాత్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.7 చొప్పున తగ్గించింది

 బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రేటును లీటరుకు రూ.3 కంటే పైగా తగ్గించింది.