ధనవంతుల జాబితా అంటే పురుషులే కాదు.. మహిళలు కూడా ఉంటారు.

ఈ జాబితాలో అమెరికా, జర్మనీ, భారత్, ఇటలీ తదితర దేశాలకు చెందిన పలువురు మహిళలు బిలియనీర్లుగా ఉన్నారు.

అమెరికాలో 92 మంది బిలియనీర్లైన మహిళలు ఉండగా, మనదేశంలో 9, జర్మనీలో 36, ఇటలీలో 16, చైనాలో 46 మంది ఉన్నారు.

ఇక మనదేశపు మహిళా బిలియనీర్ల విషయానికొస్తే..

సావిత్రి జిందాల్ (17 బిలియన్ డాలర్లు)

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. 

దివంగత వ్యాపారవేత్త ఓపీ జిందాల్ భార్యే.. సావిత్రి జిందాల్. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ఆమె కుటుంబ సభ్యుల ఆస్తి నికర విలువ 17 బిలియన్ డాలర్లు (రూ. 13,913 కోట్లు).

రోహికా సైరస్ మిస్త్రీ (7 బిలియన్లు డాలర్లు) 

దివంగత సైరస్ మిస్త్రీ భార్యే .. రోహికా సైరస్ మిస్త్రీ. ఆమె దివంగత నిర్మాణ దిగ్గజం పల్లోంజీ మిస్త్రీకి కోడలు. 

రోహికా స్వయంగా కార్పొరేట్ ఐకాన్, కొన్ని ప్రైవేట్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో డైరెక్టర్‌గా ఉన్నారు. 55 ఏళ్ల రోహికా సైరస్ మిస్త్రీ నికర విలువ 7 బిలియన్ డాలర్లు. 

రేఖా ఝున్‌ఝున్‌వాలా (5.1 బిలియన్ డాలర్లు)

బిగ్ బుల్‌గా పేరుగాంచిన పెట్టుబడిదారుడు దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా భార్యే.. రేఖా ఝున్‌ఝున్‌వాలా. 

దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఈమె ఒకరు. 59 ఏళ్ల రేఖా జున్‌జున్‌వాలా నికర ఆస్తుల విలువ 5.1 బిలియన్ డాలర్లు. 

వినోద్ రాయ్ గుప్తా (4 బిలియన్ డాలర్లు)

హావెల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తల్లి.. వినోద్ రాయ్ గుప్తా. దేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఈమె ఒకరు. 

 ఆమె మొత్తం నికర విలువ 4 బిలియన డాలర్లు. హావెల్స్ ఇండియా ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, స్విచ్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ సంబంధిత పనులకు సంబంధించిన వివిధ వస్తువులను తయారు చేస్తుంది.

సరోజ్ రాణి గుప్తా (1.2 బిలియన్ డాలర్లు)

మహాలక్ష్మి ఎసోబిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టరే.. సరోజ్ రాణి గుప్తా. APL అపోలో ట్యూబ్స్ సహ వ్యవస్థాపకురాలు కూడాను. ఆమె కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉన్నారు.

72 ఏళ్ల సరోజ్ రాణి గుప్తా మొత్తం ఆస్తుల విలువ 1.2 బిలియన్ డాలర్లు.