అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
బాలయ్య- బోయపాటి కాంబో అంటే కాసుల పంటే అని మరోసారి నిరూపించారు.
ఇప్పుడు బాలయ్య లాగానే సినిమాల్లో అఘోరా పాత్రల్లో నటించిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.
బాలయ్య (అఖండ మూవీ)
విశ్వక్ సేన్ గామీ చిత్రంలో మానసిక సమస్యలతో బాధపడే అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు.
మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి: శ్రీ మంజునాథ చిత్రంలో అర్జున్ ను పరీక్షించేందుకు అఘోర పాత్రలో కనిపిస్తాడు.
నాగబాబు: అఘోర అనే సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు.
నాగార్జున: ఢమరుకం చిత్రంలో నాగార్జున కూడా అఘోరా పాత్రలో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
వెంకటేశ్: నాగవల్లి చిత్రంలో వెంకటేశ్ అఘోరా పాత్రలో నటించారు.
ఆర్య: నేను దేవుణ్ని సినిమాలో అఘోరా పాత్రలో ఆర్య నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సోనూసూద్: అరుంధతి చిత్రంలో అఘోరాగా సోనూసూద్ నట విశ్వరూపం మనం ఎప్పటికీ మర్చిపోలేం.
శ్రీకాంత్: తమిళంలోని సౌకార్ పెట్టై సినిమాలో శ్రీకాంత్ అఘోరా పాత్రలో నటించాడు.