అల్లం, బెల్లం రెండూ ఆరోగ్యానికి మంచివే. అల్లం పైత్యం తగ్గిస్తుంది. బెల్లం చక్కెరకి ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.
అల్లం, బెల్లం ఈ రెండింటిలోనూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
అల్లం, బెల్లం మిశ్రమాన్ని రోజూ తాగితే అనేక అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టచ్చు.
అల్లం, బెల్లం మిశ్రమం రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా పని చేస్తుంది.
బెల్లంలో ఉండే జింక్, సెలీనియం తదితర పోషకాలు ఫ్రీ ర్యాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను అడ్డుకుంటాయి.
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి.
అల్లం, బెల్లం మిశ్రమం తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్ధకం తగ్గుతుంది.
అల్లం, బెల్లంలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది.
అల్లం, బెల్లం మిశ్రమంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది.
అల్లం, బెల్లం మిశ్రమంతో కీళ్ల నొప్పులకు, శ్వాస కోస సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కాలేయంలోని వ్యర్థాలు బయటకు పోయేందుకు ఈ అల్లం, బెల్లం మిశ్రమం బాగా పని చేస్తుంది.
శరీరానికి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా రుతుస్రావం సమయంలో స్త్రీలు ఈ మిశ్రమం సేవిస్తే నొప్పులు తగ్గుతాయి.
ఈ మిశ్రమంలో తేనె కలుపుకుని తాగితే శరీరం దృఢంగా తయారవుతుంది.
భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఆహారం బాగా జీర్ణమవుతుంది. అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటివి ఉండవు.