ఈ పండ్లు పైన పింక్ కలర్లో లోపల తెల్లగా, నల్లటి గింజలతో ఉంటాయి. ఇప్పుడు లోపల కూడా గులాబీ రంగు ఉండేలా చేస్తున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో ఐరన్, మెగ్నీషీయం కూడా ఎక్కువగానే ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ బాగుంటుంది.
డ్రాగన్ ఫ్రూట్లో ఉండే ప్రోబయోటిక్స్ పొట్ట, పేగులు, అన్నవాహికను శుభ్రం చేస్తాయి.
ఈ పండ్లలో క్యాన్సర్ రాకుండా అడ్డుకునే బెటాలైన్స్, కెరొటెనాయిడ్స్ ఉంటాయి
లోపలి గింజలు కూడా అరటిపండులోని గింజల్లా కరకర అంటూ తినడానికి బాగుంటాయి.
వీటి ధర సుమారుగా మార్కెట్లో ఒక్కొక్కటి రూ.70 నుంచి రూ.100 వరకు ఉంటుంది.
ధర కాస్త ఎక్కువే అయినా.. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టే డ్రాగన్ ఫ్రూట్ కు అంత క్రేజ్.