సరిపడా నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. తగిన మోతాదులో నీరు తాగకపోతే కిడ్నీలో రాళ్లు పేరుకుపోతాయి.

నీరు ఎక్కువగా తాగితే రాళ్లు ఏర్పడడానికి దారి తీసే పదార్థాలు పలుచనవుతాయి. దీంతో మూత్రంతో పాటు సులువుగా బయటకు వచ్చేస్తాయి.

రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగితే కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టవచ్చు.

కాల్షియం తక్కువైనా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కాల్షియం తగినంతగా లేకపోతే మూత్రంలో ఆక్టలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడతాయి.

50 ఏళ్ళు పైబడిన వారు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం ఆహారం రూపంలో తీసుకోవాలి. అలానే విటమిన్ డి కూడా తీసుకోవాలి.

డయాబెటిస్ ఉన్నవారిలో ఎసిడిక్ మూత్రం ఉంటుంది. మూత్రంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. .

కాబట్టి సరిపడా నీరు తాగాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు

 అలానే పోషకాహారం తీసుకుంటే కిడ్నీలో రాళ్లను నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. 

ఉప్పులో సోడియం ఉంటుంది. సోడియం అధికంగా తీసుకున్నా కిడ్నీలు రాళ్లు వచ్చే ముప్పు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే.. మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరిగి కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. రోజుకు 2300 మిల్లీగ్రాముల సోడియం తీసుకోవాలని సూచిస్తున్నారు.

మాంసాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం అధికంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

చికెన్, గుడ్లు, రొయ్యలు, చేపలు వంటివి ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్ మూత్రంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుతుంది.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా ఆపే సిట్రేట్ స్థాయిలు పడిపోతాయని చెబుతున్నారు.

కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ వల్ల మూత్రంలో కాల్షియం మోతాదు పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

అలానే కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతాయని అంటున్నారు.  

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.