యూఏఈ వేదికగా ప్రారంభమైన ఆసియా  కప్‌ 2022లో భారత్‌ తొలి మ్యాచ్‌లో  పాకిస్థాన్‌పై విజయంతో శుభారంభం చేసింది.

ఇప్పటి వరకు ఆసియా కప్‌  14 సార్లు జరిగింది.

అత్యధికగా భారత్‌ 7 సార్లు విజేతగా నిలిచింది.

భారత్‌ తర్వాత అత్యధికంగా 5 సార్లు ఆసియా కప్‌  గెలిచి శ్రీలంక రెండో స్థానంలో ఉంది.

పాకిస్థాన్‌ కూడా రెండు సార్లు  ఆసియా కప్‌ నెగ్గింది.

మరి టీమిండియాకు 7 సార్లు ఆసియా కప్‌  అందించిన కెప్టెన్లు ఎవరూ చూద్దాం..

ఆసియా కప్‌ను తొలిసారి 1984లో నిర్వహించగా..  సునీల్‌ గవాస్కర్‌ కెప్టెన్సీలో టీమిండియా  శ్రీలంకను ఫైనల్‌లో ఓడించి తొలి ఛాంపియన్‌గా  అవతరించింది. 

అలాగే 1988లో దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సారథ్యంలో  టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుని..  రెండో సారి విజేతగా నిలిచింది.

1991లో జరిగిన ఆసియా కప్‌లో మొహమ్మద్‌  అజహరుద్దీన్‌ కెప్టెన్సీలో భారత్‌ ఆసియా కప్‌  గెలిచింది. ఈ సారి కూడా శ్రీలంకపై ఫైనల్‌  నెగ్గింది.

1995లో కూడా మొహమ్మద్‌ అజహరుద్దీన్‌  కెప్టెన్సీలోనే టీమిండియా ఆసియా కప్‌ విజేతగా  నిలిచింది.

తిరిగి చాలా కాలం తర్వాత 2010లో టీమిండియా  అత్యుత్తమ కెప్టెన్‌ ధోని సారథ్యంలో భారత్‌  ఆసియా కప్‌ విజేతగా అవతరించింది.

2016లోనూ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో  భారత్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి  ఆసియా కప్‌ను సాధించింది.

2018లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని  టీమిండియా ఆసియా కప్‌ను సాధించింది. 

తాజాగా ఆసియా కప్‌ 2022లో కూడా రోహిత్‌ శర్మ  సారథ్యంలోనే టీమిండియా ఆడుతోంది.