గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం శుద్ధిగా ఉండాలి. రక్తప్రసరణ బాగా జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు, ఆహారంలో ఉండే వ్యర్థ పదార్థాల వల్ల రక్తంలో మలినాలు చేరతాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

రక్తంలో మలినాలు, వ్యర్థాలు చేరడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

అందుకే రక్తాన్ని శుద్ధి చేయడం చాలా ముఖ్యం. కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగించి రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు.

వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. 

వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్ ను బయటకు పంపడంలో పని చేస్తాయి.

చర్మవ్యాధులు, అల్సర్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి వేప రక్షిస్తుంది. రోజూ రెండు వేపాకులు నమిలితే రక్తం శుద్ధి అవుతుంది

గోరు వెచ్చని నీళ్లలో వేప పొడి వేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. 

మంజిష్ఠ ఇది వేపలా చేదుగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

తిప్పతీగ రక్తాన్ని శుద్ధి చేయడంలో బాగా పనిచేస్తుంది. ఇది రక్తం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. 

అలానే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తిప్పతీగ పొడిని గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఉసిరి రక్తాన్ని శుద్ధి చేయడంలో బాగా పని చేస్తుంది. రక్తంలో ఉన్న హానికర వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

తరచుగా ఉసిరి రసాన్ని తీసుకుంటే హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

ఉసిరి టీ, ఉసిరి చట్నీ, ఉసిరి మురబ్బా వంటి ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.  

తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉదయానే పరగడుపున 4 తులసి ఆకులు తింటే రక్తం శుద్ధి అవుతుంది. 

తులసి ఆకుల్లో ఉండే ఆక్సిజన్ రక్తంలోని ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాక జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలో పసుపు బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి.

పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో అనేక సమస్యలతో పోరాడుతుంది. 

పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ పసుపు పాలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి.

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.