కొన్ని రకాల మసాలా దినుసులను ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మరి..రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే ఆ మసాలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే మసాలాల్లో దాల్చిన చెక్క ఒకటి.
దాల్చిన చెక్కలో సహజ చక్కెర ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
ఇతర స్వీట్లకు బదులుగా మధుమేహ సమస్యతో బాధపడే వారు దాల్చిన చక్కను ఉపయోగించొచ్చు.
మెంతులలో ఉండే ఔషదగుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తాయి.
మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతుందంట.
కానీ మెంతులను తినడం వల్ల డయాబెటిస్ పూర్తిగా నయం అవుతుందని అనుకోకూడదు.
మెంతులను మీ రోజు వారి వంటల్లో వేయడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ సమర్థవంతంగా పనిచేస్తుంది.
కలబంద మధుమేహులకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కలబంద అనేక మధుమేహ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ క్యాన్సర్ల నుంచి ఎన్నో అంటువ్యాధులను నివారించడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.
పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటుగా.. రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
కరివేపాకు, వెల్లుల్లి కూడా మధుమేహుల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణుుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో సేకరించింది మాత్రమే. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.