ప్రస్తుతం అందరూ సన్‌ ఫ్లవర్‌, ఆలీవ్‌ ఇలా రకరకాల నూనెలు వాడుతున్నారు.

కానీ పూర్వ కాలంలో మాత్రం ఎక్కువగా నువ్వుల నూనె వాడేవారు. 

గానుగ ఆడించి తీసే ఈ నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఆహారంలో భాగంగానే కాక.. శరీరానికి మసాజ్‌ చేయడానికి కూడా వాడతారు.

ప్రస్తుతం నువ్వుల నూనె వాడకం తగ్గిపోయింది. కానీ దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

నువ్వుల నూనె వాడటం వల్ల బలం, దేహపుష్టి కలుగుతాయి.

ఈ నూనె వినియోగించడం వల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. స్త్రీల‌లో రుతుక్రమం సరిగ్గా వస్తుంది.

నువ్వుల నూనె కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డమే కాక.. జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

నువ్వుల నూనెతో మర్దనా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది.

అయితే నువ్వుల నూనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికి.. దీన్ని వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

నువ్వుల నూనెలో హార‌తి కర్పూరాన్ని కానీ, త‌మ‌ల‌పాకును కానీ క‌ల‌ప‌కూడ‌దు. అలా చేస్తే.. ఈనూనె విషంగా మారుతుంది. 

ఎవరైనా నువ్వుల నూనెలో పైన చెప్పిన పదార్థాలు కలిపి తీసుకుంటే ఆ విషానికి విరుగుడుగా గంజిని కానీ తేనె క‌లిపిన నీటిని కానీ తాగించాలి.

ప్ర‌స్తుత కాలంలో ఈ నూనెను కూడా క‌ల్తీ చేస్తున్నారు. క‌నుక దీనిని బాహ్యంగానే ఎక్కువ‌గా ఉప‌యోగించాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తూ నువ్వుల నూనె వాడితే ఎన్నో లాభాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.