మనం ఎంతో ఇష్టంగా తినే పండ్లలో దానిమ్మ ఒకటి. ఈ దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయి.
షుగర్ పేషెంట్లు దానిమ్మ పండు తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
దానిమ్మపండులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నాయి.. ఇది జీర్ణ శక్తిని పెంచడంలో ఎంతో తోడ్పడతాయి.
దానిమ్మ పండు క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం దూరం చేస్తుంది.
ఎక్కువగా బీపీ ఉన్నవారు దానిమ్మ పండు తింటే ఎంతో కట్రోల్ అవుతుంది.
దానిమ్మ గింజలలో అధిక మొత్తంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉన్నాయి
దానిమ్మ పురుషులలోని స్పెర్మ్ కౌంట్, వీర్యం నాణ్యతను ఎంతగానో మెరుగుపరుస్తుంది.
దానిమ్మ గుంజెలు తినడం, జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
ప్రతిరోజూ రోజుకో గ్లాసు దానిమ్మ రసం తాగితే హృదయ సంబంధిత రోగాలు మటుమాయం అవుతాయి
దానిమ్మ తినడం వల్ల గొంతు నొప్పి, దగ్గు ఇంకా ఉదర సంబంధిత సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.
దానిమ్మ మొటిమలు తగ్గిడచంలోనూ.. చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది.
దానిమ్మ తొక్కలను చూర్ణం చేసుకొని తింటే డయేరియా, జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
కాలుష్యం వల్ల వచ్చే బ్యాక్టీరియా ఇంకా ఇన్ఫెక్షన్లను నివారించడంలో బాగా సహాయపడుతుంది.