అనారోగ్యంతో బాధపడే వారికి  కావల్సిన ఔషదాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి.

సాధారణంగా పొలాల్లో చెట్లను అల్లుకొని పిచ్చిమొక్కలా కనిపించే తిప్పతీగలో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నాయి.

శరరంలో విషపదార్థాలను బయటకు పంపి.. ఒత్తిడి పారదోలగల శక్తి తిప్పతీగలో ఉంది. 

తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలు ఉంటాయి.. ఇవి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఆల్కలాయిడ్లు, లాక్టెన్లు లనబడే బయో యాక్టీవ్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో తిప్పతీగ ఉపకరిస్తుంది. 

తిప్పతీగ ఔషదం దాగితే..  జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను తొలగిపోతాయి. 

తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ కూడా తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. 

తిప్పతీగలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ లు సూక్ష్మ క్రిములతో పోరాడి నాశనం చేస్తాయి.

తిప్పతీగ ఆకు పొడి చేసుకొని బెల్లంలో కలుపుకొని తాగితే.. అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.  

 తిప్పతీగ చూర్ణం తీసుకుంటే.. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 

 తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి తాగితే  కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

తిప్పతీగతో ఛాతీ బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం,ఉబ్బసం లాంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.