అల్లంలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అందుకే అల్లాన్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. కొంతమంది అల్లం టీ కూడా తాగుతుంటారు.
అయితే అదే అల్లాన్ని పాలలో వేసుకుని కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అల్లం రసం కలిపిన పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములను అల్లం రసం నాశనం చేస్తుంది.
అల్లం పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సార్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి.
అల్లం పాలు తాగితే జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్ధకం, కడుపు నొప్పి, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
అల్లంపాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. ఎముకలను, దంతాలను దృఢంగా చేస్తాయి.
ఆస్టియోపోరోసిస్ సమస్యతో బాధపడేవారు ఈ అల్లం పాలు తాగితే మంచిది.
గొంతు మంట, గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం లాంటి సమస్యలు ఉన్నవారు అల్లం పాలు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఈ అల్లం పాలను తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలతో పాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.
రోజూ ఉదయం అల్పాహారం తర్వాత అల్లం పాలను సేవిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
గమనిక: ఈ చిట్కాను పాటించే ముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా మనవి.