సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత సోంపు వేసుకోవడం అలవాలు. అయితే ఈ సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సోంపు గింజల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
సోంపులో ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు లభిస్తాయి.
సోంపు ద్వారా మనకు లభించే విటమిన్ సితో శరీర రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటుని సాధారణంగా స్థితిలో ఉండేటా చూస్తుంది.
సోంపు తినడం వల్ల మల మూత్రనాళాలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోక కుండా ఉంటుంది.
సోంపు రక్తహీనత భారిన పడకుండా కాపాడుతుంది. అలాగే హిస్టీడిన్ హిమో గ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చైతన్య పరుస్తుంది.
సోంపు గింజల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనం బరువు తగ్గుతాము. ఆకలి కూడా ఎక్కువగా వేయదు.
సోంపు గింజలు, జీర్ణం అవడానికి, గ్యాస్ట్రిక్ కు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
పొట్టకు సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది.
ఒక కప్పు సోంపు గింజల్లో, ఒక రోజుకు అవసరమయ్యే విటమిన్ సి లో 20% లభిస్తుంది.
ఋతుక్రమ లక్షణాలను మెరుగుపరచడానికి సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
సోంపు గింజల్లో విటమిన్ సి మరియు ఎమినో ఆమ్లాలు అధిక శాతంలో ఉంటాయి. ఇవి మీ కళ్ళను రక్షిస్తాయి
వంటల్లో సోంపు గింజలు వాడటం వల్ల, మీ కళ్ళకు మంట కలగ కుండా కాపాడుతుంది