సాధారణంగా చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే.. రోజు ప్రారంభం కాదు.
ఇక మార్కెట్లలో రకరకాల టీ, కాఫీలు మనకు అందుబాటులోనే ఉంటాయి.
అయితే మసాలా చాయ్ తో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మనం సాధారణంగా తాగే టీకి కొన్ని సుగంధ ద్రవ్యాలను జోడిస్తే మీ ఆరోగ్యం అద్భుతం అంటున్నారు వారు.
మసాలా చాయ్ తాగితే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీని లవంగాలు, యాలకులు, జాజికాయ, దాల్చినచెక్క, కుంకుమ పువ్వు లాంటి సుగంధ ద్రవ్యాలతో తయ్యారు చేస్తారు.
ఇక చలికాలంలో మసాలా టీ తాగితే.. బాడీలో వేడి పెరుగుతుంది.
ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీర రోగనిరోధక శక్తికి పెంచడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి మసాలా టీ గొప్పగా పనిచేస్తుంది. వీటిల్లో ఉండే పోషక విలువలు బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
మసాలా టీ తాగడం మూలాన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
అలాగే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.