ఎవరైన తామకు మంచి  జీతం వస్తుంటే ఇళ్లు, కారు కొనుక్కోవాలి అని అనుకుంటారు.

మరి కొందరు తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకునేందుకు దాచుకోవాలని భావిస్తుంటారు.

ఓ యువకుడు మాత్రం గురజాడ చెప్పిన ఓ మాటను  ఆచరణలో పెట్టాడు.

"సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడు పడవోయ్" అని గురజాడ చెప్పిన మాటను ఆ యువకుడు పాటించాడు.

తన పెళ్లి  కోసం దాచుకున్న రూ.10.50 లక్షలను  డబ్బును ఊరి కోసం ఖర్చు పెట్టాడు.

తమిళనాడు చెందిన చంద్రశేఖరన్ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 

చంద్రశేఖర్ ఉండే గ్రామంలో మొత్తం 350 కుటుంబాలు నివసిస్తున్నాయి.

తన చిన్నతనం నుంచి అవే మట్టి రోడ్లు ఉన్నాయని చంద్రశేఖర్ ఆవేదన చెందాడు. 

 తనకు వీలునప్పుడల్లా పంచాయతీ, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసులకు వెళ్లి గ్రామ పరిస్థితి వివరించే వాడు.

నిత్యం ఎవరో ఒకరు బురద రోడ్లపై జారి పడి గాయపడుతున్నారని అధికారులకు తెలిపాడు

అయితే తమకు నిధులు వస్తే తప్ప రోడ్లు వేయలేమని అధికారులు చెప్పారు.

దీంతో రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చులో తాను సంగం భరిస్తానని చంద్రశేఖర్ తెలిపాడు.

ఈ క్రమంలో తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను రోడ్డు వేయడం కోసం ఉపయోగించాడు. 

చంద్రశేఖరన్‌ను ప్రభుత్వం ఘనంగా సత్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.