రామ్ కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పి తమిళ డైరెక్టర్ లింగుసామీతో ‘ది వారియర్’ మూవీ చేశాడు. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా..

కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక ఆది పినిశెట్టి విలన్ గా నటించడంతో ‘ది వారియర్’ మూవీపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి.

సత్య(రామ్ పోతినేని) మెడిసిన్ చదివి డాక్టర్ గా కర్నూల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో డ్యూటీలో చేరతాడు. అయితే.. అప్పటికే కర్నూల్ జిల్లా అంతా గురు (ఆది పినిశెట్టి) కంట్రోల్ లో ఉంటుంది.

వరుస హత్యలు, సెటిల్ మెంట్స్ తో రౌడీగా ఎదిగిన గురుకు ఎదురు ఎవరొచ్చినా చంపేస్తుంటాడు. ఈ క్రమంలో డాక్టర్ సత్యకు లోకల్ రేడియో జాకీ విజిల్ మహాలక్ష్మి(కృతి శెట్టి)తో పరిచయం ఏర్పడి..

ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ నేపథ్యంలో అనుకోని కొన్ని సంఘటనల వలన డాక్టర్ సత్యకు, గురుకి వైరం ఏర్పడుతుంది. కట్ చేస్తే.. కొంతకాలం తర్వాత కర్నూల్ జిల్లాకు పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తాడు సత్య.

మరి డాక్టర్ సత్య పోలీస్ ఎందుకయ్యాడు? ఎలా అయ్యాడు? గురుతో వైరం సత్య లైఫ్ ని ఎలాంటి మలుపులు తిప్పింది? చివరికి విజిల్ మహాలక్ష్మి, సత్య ఎలా ఒక్కటయ్యారు? అనేది తెరపైనే చూడాలి.

విశ్లేషణ:

ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ తో అటు డాక్టర్ గా, ఇటు పోలీస్ గా రెండు వేరియేషన్స్ ని చాలా బాగా చూపించాడు రామ్.

గురు పాత్రలో ఆది పినిశెట్టి యాక్టింగ్, యాటిట్యూడ్ అన్నీ పీక్స్ లో డిసైన్ చేశారు. అలాగే ఆది డైలాగ్ డెలివరీ కూడా ఇంటెన్స్ గా ఉంది.

అలా ఫస్ట్ హాఫ్ అంతా ఓవైపు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, మరోవైపు విలన్ అరాచకాలు సపరేట్ గా చూపించారు.

లింగుసామీ సినిమాల్లో హీరోయిన్స్ హీరోలను డామినేట్ చేస్తుంటారు. ఇక్కడ హీరో డాక్టర్ కాబట్టి సాఫ్ట్ గా హీరోయిన్ని రేడియో జాకీ రోల్ లో చూపించారు. ఇక గ్యాప్ లేకుండా ఏదోకటి వాగుతూనే ఉంటుంది అన్నమాట.

ఒక్కటి మాత్రం స్ట్రాంగ్ గా చెప్పవచ్చు. హీరో రామ్ ఫ్యాన్స్ కి, విలన్ గా నటించిన ఆది ఫ్యాన్స్ కి వారియర్ మూవీ పండగే. ఎందుకంటే.. వీరిద్దరినీ ఇదివరకు చూడని విధంగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు..

కథాకథనాలలో కొత్తదనం లేకుండా తీయడం గమనార్హం. కానీ.. క్లైమాక్స్ ఫైట్స్ బాగున్నాయి.మొత్తంగా పవర్ ఫుల్ పోలీసోడు, పవర్ ఫుల్ విలన్ మధ్య జరిగిన వార్ ఈ వారియర్.

రేటింగ్: 2.5/5