మెక్-మోహన్ సరిహద్దు రేఖ దాటి భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా ఏకంగా 100 ఏళ్లు నిర్మించి ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా పేర్కొంది.
2020లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎల్ఈటీ తూర్పు సెక్టార్లో టిబెట్ అటానమస్ రేసియన్ భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించినట్లు నివేదికలో పేర్కొంది.
ఈ గ్రామం అరుణాచల్ప్రదేశ్లోని ఎగువ సుభాన్షిరి జిల్లాలోని ష్యార్చు నది ఒడ్డున ఉంది.
ఈ ప్రాంతం 1962 యుద్ధానికి ముందు కూడా భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలకు దారి తీసింది.
చైనా ఒక దశాబ్దానికి పైగా ఈ ప్రాంతంలో ఒక చిన్న సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది.
కాగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు, చర్చలు కొనసాగుతున్నప్పటికీ చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అమెరికా నివేదిక పేర్కొంది.
కాగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో చైనా మన భూభాగంలో ఒక ఇంచు కూడా ఆక్రమించలేదని ప్రకటించారు.
కానీ అమెరికా నివేదన మాత్రం మోదీ ప్రకటనను తప్పుబడుతూ.. చైనా ఆక్రమణను బహిర్గతం చేస్తుంది.