ఆరోగ్య సమస్యలు కొన్ని ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు.

అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించే మనిషి.. క్షణాల్లో గుండెపోటు మరణిస్తున్నారు. 

హర్ట్ స్ట్రోక్  ఎంత ప్రమాదకరమైనదో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కూడా అంతే ప్రమాదం.

అయితే గుండె  కంటే బ్రెయిన్‌ సమస్యతో బాధపడే వారి సంఖ్య కాస్త తక్కువగా ఉంటుంది.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చేముందు కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయని నిపుణులు తెలిపారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌  వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం

నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపించడం, కళ్లు మసకబారడం

బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుంది.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. 

చాలా మంది తల వెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుందని కొందరు నిపుణులు తెలిపారు.

ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందంట.

బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే ముందు శ్వాస, ఛాతీలో సమస్య ఏర్పడుతుందంట.

అధికంగా ఆలోచించడం కుండా యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

బ్రెయిన్ స్ట్రోక్ కి నివారణకు వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాలు తీసుకోవాలి.