గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

గర్భ నిరోధక మాత్రల కారణంగా రొమ్ము క్యాన్సర్ ముప్పు 20 నుంచి 30 శతం వరకూ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఐదేళ్ల పాటు ప్రొజెస్టెరోన్ గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉంటుందని అధ్యయనం చెబుతోంది.

16 నుంచి 20 ఏళ్ల వయస్సులో 10 వేల హార్మోన్ల గర్భ నిరోధక వినియోగదారులలో 8 మందికి రొమ్ము క్యాన్సర్ వస్తే 35 ఏళ్ల వయసులో 10 వేల మందిలో 265 మందికి రొమ్ము క్యాన్సర్ వస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

యువతుల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువే అయినా గర్భ నిరోధక మాత్రలు వాడడం వల్ల పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అందుకే ఈ పిల్స్ వాడకం తగ్గించాలని, అప్పుడే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అంటున్నారు.

వయసు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువనేది నిజమే అని అంటున్నారు.

కంబైన్డ్ హార్మోన్లు కలిగిన మాత్రలు వాడిన మహిళల్లో మాత్రమే రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

కంబైన్డ్ గర్భ నిరోధక మాత్రల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్ రెండు హార్మోన్ల కాంబినేషన్ ఉంటుంది.

అయితే కంబైన్డ్ గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలతో పోలిస్తే.. ప్రొజెస్టెరోన్ మాత్రమే ఉన్న గర్భ నిరోధక మాత్రలు వాడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇప్పటి వరకూ ప్రొజెస్టెరోన్, ఈస్ట్రోజన్ గర్భ నిరోధక మాత్రల్లో ఏవి వాడినా గాని.. ఇక నుంచి వాడకం ఆపేస్తే రొమ్ము క్యాన్సర్ కి కారణమయ్యే వాటి ప్రభావం శరీరంపై పడదని పరిశోధకులు చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా చెప్పబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను గానీ వైద్యులను గానీ సంప్రదించవలసిందిగా మనవి.