ఉదయ్ కిరణ్.. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ

 మరచిపోలేని ఓ ధ్రువతార.ఉదయ్ మరణానికి

సినిమా ఆవకాశాలు రాకపోవడం ఒక్కటే కారణమా

అంటే.. కచ్చితంగా అవును అని చెప్పలేము. 

ఎందుకంటే ఉదయ్ మరణించే సమయానికి 

అతని వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా 

లేదని సన్నిహితులు చెప్తూ ఉంటారు. అయితే..

ఉదయ్ కిరణ్ చివరి లేఖ తాజాగా బయట పడింది. 

ప్రస్తుతం ఈ లేఖ అందరి చేత కన్నీరు పెట్టిస్తుంది.

ఆ లేఖలో ఏమి ఉందో ఇప్పుడు చూద్దాం.

“విషితా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కానీ..,

ఆమె తరువాత జీవితంలో అంతగా ప్రేమించింది నిన్నే.

కానీ.., మన మధ్య గొడవలు రావడం దురదృష్టకరం

ఈ గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ

పడుతున్నారు.

వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచి

 వాడని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు

మంచివాడు కాదు. నా మాట విను. త్వరలోనే నీవు 

నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ.., అప్పుడు

ఉదయ్ ఉండడు!

సినీ పరిశ్రమలో నాకు చాలా అవమానాలు 

ఎదురయ్యాయి ఇక్కడ నన్ను ఓ మ్యాడ్‏ ఫెలోగా 

చిత్రీకరించారు. ఇప్పుడు నా కారణంగా చాలా మంది

బాధలు పడుతున్నారు. అందరూ సంతోషంగా 

ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను.

మా అమ్మ నీకు ఇచ్చిన నగలను మాత్రం అక్కకి

తిరిగి ఇచ్చేయి. అక్క వాటిని అమ్మ గుర్తుగా

దాచుకుంటుంది.అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని

ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..అంటూ ఆ లెటర్ 

లో ఉంది. ఈ లెటర్ ఉదయ్ కిరణ్ రాసిన చివరి లెటర్

గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే..

ఈ లెటర్ నిజమా? ఫేకా అన్న చర్చ కూడా గట్టిగానే

నడుస్తోంది. ఎందుకంటే ఉదయ్ కిరణ్ ఎప్పుడో రాసిన

లెటర్ ఇప్పటి వరకు ఎందుకు బయటకి రాలేదన్న 

ప్రశ్న గట్టిగా ఉత్పన్నం అవుతోంది. ఏదేమైనా.. 

ఈ లెటర్ చదివిన వారు మాత్రం ఉదయ్ కిరణ్

మిగిల్చి పోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 

కన్నీరు పెట్టుకుంటున్నారు. మరి.. ఈ లెటర్

విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ 

రూపంలో తెలియజేయండి.