హ్యాపీడేస్‌ చిత్రంతో పరిచయమైన నిఖిల్ మొదట్లో రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చారు.

హ్యాపీడేస్‌ తర్వాత వచ్చిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. 

దీంతో ఇక నిఖిల్ పని అయిపోయిందనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 'స్వామి రారా'తో పెద్ద హిట్ కొట్టారు.

ఆ తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అలరిస్తూ వచ్చారు.

నిఖిల్ సినిమా అంటే కంటెంట్‌ బాగుంటుంది అనే స్థాయికి వచ్చారు.

'స్వామి రారా' నుండి 'కార్తికేయ 2' వరకూ ఆ సినిమాలు నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళను రాబట్టాయి. 

స్వామి రారా: రూ. 7.1 కోట్లు

కార్తికేయ: రూ. 7.5 కోట్లు 

కిరాక్ పార్టీ: రూ. 7.55 కోట్లు

కేశవ: రూ. 7.9 కోట్లు

అర్జున్ సురవరం: రూ. 9 కోట్లు

ఎక్కడికి పోతావు చిన్నవాడా: రూ. 16 కోట్లు

కార్తికేయ 2: రూ. 20 కోట్లు (ఇంకా రాబడుతూనే ఉంది)