స్టార్ డైరెక్టర్ ఆర్జీవీతో డ్యాన్స్ చేసి ఫేమస్  అయిన బ్యూటీ ఇనయా సుల్తానా. 

రెండుసినిమాలు చేసినప్పటికీ  ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిందో  ఇనయా గురించి అందరూ  మాట్లాడుకున్నారు.

ఎందుకంటే ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన తర్వాత..  తన ఇంట్లో గొడవలు అయ్యాయని, 

తనని దూరం పెట్టారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని చెప్పింది.  ఈసారి బిగ్ బాస్ హౌసులో గొడవలు,  టాస్కులు.. 

ఇలాప్రతి దానిలోనూ తన మార్క్ చూపిస్తూ వస్తోంది.

ఇక తాజాగా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్  టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే  ఆదిరెడ్డి భార్య, కూతురు..

శ్రీహాన్ భార్య సిరితో పాటు వాళ్ల కొడుకు..  ఫైమా తల్లి.. రోహిత్ తల్లి..  శ్రీసత్య తల్లిదండ్రులు..

లా చాలామంది బిగ్ బాస్ లోకి వచ్చారు.  గురువారం ఎపిసోడ్ కోసం ఇయనా తల్లి  హౌసులో అడుగుపెట్టారు.

‘నువ్వు గెలిచిరావాలి.. నీకోసం  ఎదురుచూస్తున్నాం.. నువ్వు గెలిచి  ఇంటికి రావాలి’ అని చెప్పడంతో

ఇనయా ఎమోషనల్ అయింది.  క్షమించమని కోరుతూ తల్లి కాళ్లపై పడింది.

ఇదంతా చూస్తున్న నెటిజన్స్…  ఇనయాని తల్లిదండ్రులు క్షమించేసినట్లే  కనిపిస్తోంది.

మరి బిగ్ బాస్ ప్రోమోలో ఇనయా ఎపిసోడ్  కోసం మీలో ఎంతమంది వెయిట్  చూస్తున్నారు.