సినిమాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలుగా ఆస్కార్స్ ను భావిస్తారు.
నటీనటులు, టెక్నీషియన్స్ ఇలా సినీ రంగంలో పనిచేస్తున్న వారు ఆస్కార్ ను గెలుచుకోవాలని కలలు కంటారు. ను భావిస్తారు.
ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటాలని భారత్ కూడా ఎన్నాళ్లుగానో అనుకుంటోంది.
ఒక్క కేటగిరీలోనైనా పురస్కారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఎట్టకేలకు భారత్ ఆశ నెరవేరింది. ఈ ఏడాది ఇండియాకు ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు దక్కాయి.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’కు అవార్డు లభించింది.
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే ఇండియన్ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ పురస్కారం దక్కింది.
అయితే ఆస్కార్ అవార్డు అందుకున్న స్టేజి మీద తనకు అవమానం జరిగిందని ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత గునీత్ మోంగా అన్నారు.
ఆస్కార్ అందుకున్న వారికి స్టేజీపై 45 సెకన్లు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు.
కానీ గునీత్ విషయంలో అలా జరగలేదు. ఆమె మాట్లాడటం మొదలుపెట్టగానే తన మైక్ కట్ చేసి, మ్యూజిక్ ప్లే చేశారు.
దీని వల్ల తాను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పకుండానే ఆస్కార్ స్టేజీ మీద నుంచి వైదొలగాల్సి వచ్చిందని గునీత్ వాపోయారు.
ఆ క్షణంలో ఆస్కార్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నట్లు అనిపించిందని గునీత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్కార్ స్టేజీపై జరిగిన అవమానం తనకు ఒక్కరికి మాత్రమే కాదని.. ఇది యావత్ భారత్కు జరిగిన అవమానంగా భావిస్తున్నానని గునీత్ చెప్పారు.
ఆస్కార్ స్టేజీపై గునీత్ కు జరిగిన అవమానంపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు.
మిగతావారి విషయంలో ఒకలా, గునీత్ విషయంలో మరోలా వ్యవహరించడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.