బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు
టాలీవుడ్ లో స్ట్రయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ సినిమాలు పోటీపడుతున్నాయి
నెలకు 20కి పైగా సినిమాలు రిలీజ్ అవుతుండగా, వాటిలో 5 లోపే హిట
్స్ గా నిలుస్తున్నాయి
అయితే.. తెలుగైనా, డబ్బింగ్ సినిమాలైనా కంటెంట్ ప్రకారమే హిట్ అవుతున్నాయ
ి
ఇక ఈ ఏడాది తెలుగులో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాలున్నాయి
KGF 2: ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. రూ. 100 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది
విక్రమ్: కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ మూవీ.. తెలుగులో డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది
బ్రహ్మాస్త్రం: రణబీర్ కపూర్ హీరోగా.. తెలుగులో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి, డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది
విక్రాంత్ రోణ: కిచ్చా సుదీప్ హీరోగా ఈ మూవీ తెలుగులో మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది
డాన్: శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది
గంగూబాయ్ కతీయవాడి: అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కి.. తెలుగులో మంచి హిట్ అందుకుంది
వలిమై: అజిత్ హీరోగా.. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి, ఫైనల్లీ యావరేజ్ హి
ట్ అనిపించుకుంది
ఈటి(ఎవరికీ తలవంచడు): సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమా.. తెలుగులో యావరేజ్ కలెక్షన్స్ సాధించింది
బీస్ట్: దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగులో యావరేజ్ కలెక్షన్స్ సాధించింది
కోబ్రా: చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా.. తెలుగులో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి యావరేజ్
హిట్ అందుకుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి