పొట్టిగా ఉన్నా.. పొడవుగా ఉన్నా ఆడవాళ్లకి హై హీల్స్ వేసుకోవడం ఎంతో ఇష్టం.

చాలా మందికి హై హీల్స్‌ వేసుకోవాలి అనే కోరిక బాగా ఉంటుంది.

అందుకని షాపింగ్‌ చేసే సమయంలో హై హీల్స్‌ ని ఎక్కువగా ప్రిఫర్‌ చేస్తుంటారు.

ఇంకొందరు అయితే ఒక డ్రెస్సు మీదకు ఒక రకం చెప్పులు, హై హీల్స్‌ ని కొంటూ ఉంటారు.

కొందరు అమ్మాయిలు మాత్రం ఇంట్లో వాళ్లు హై హీల్స్ వేసుకునేందుకు అంగీకరించరని చాలా బాధపడిపోతూ ఉంటారు.

అయితే మీరు అంత బాధ పడాల్సిన అవసరం లేదు. హై హీల్స్ వల్ల వచ్చే నష్టాలు తెలిస్తే అసలు మీరు వేసుకోవాలి అనుకోరు.

అవును హై హీల్స్‌ ని వాడటం వల్ల ఒకటి కాదు రెండు కాదు.. చాలానే నష్టాలు ఉన్నాయి.

హై హీల్స్ వేసుకుంటే ఆడవాళ్ల మోకాళ్లు వంగిపోతాయి.

హై హీల్స్‌ వల్ల మోకాళ్లలో మృదులాస్థి అరిగిపోతుంది.

మోకాళ్లలో మృదిలాస్థి అరిగిపోతే.. మోకాళ్ల నొప్పి వస్తుంది.

 శరీరం బరువు మొత్తం ముందు కాళ్లపై పడటం వల్ల.. చీలమండ, కీళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

హై హీల్స్ వల్ల కండరాల నొప్పి మాత్రమే కాదు.. నడుపు నొప్పి కూడా వస్తుంది.

ఇంకా హై హీల్స్‌ వాడటం వల్ల బ్యాక్‌ కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

హై హీల్స్ ని ఎప్పుడన్నా ఒకసారి వాడితే ఎలాంటి నష్టం ఉండదు. కానీ, ఎక్కువగా వాడితే మాత్రం నష్టాలు తప్పవు.