వైట్-బాల్ ఫార్మాట్‌లలో యార్కర్ డెలివరీని  ఎదుర్కోవడానికి ఆటగాడు ఉపయోగించగల  అత్యుత్తమ షాట్‌లలో హెలికాప్టర్ షాట్ ఒకటి.

టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని  ఈ షాట్‌ను పాపులర్ చేశాడు. ఎన్నో మ్యాచుల్లో  కూడా అలాంటి సిక్సర్లు మనం చూశాం.

'MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా  సమయంలో, ధోని తనకు కాబోయే బావమరిది  నుండి గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో ఈ షాట్ నేర్చుకున్నాడని  వెల్లడైంది. 

ఆసక్తికరంగా, అతను కొన్ని సమోసాల కొనిస్తానంటే  ఆ షాట్ ధోనీకి నేర్పించాడట.

ప్రస్తుతానికి ధోని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా  మనం మాత్రం ఆ షాట్ ను మర్చిపోలేకపోతున్నాం.

ధోని కాకుండా హెలికాప్టర్ షాట్ ఆడిన క్రికెటర్లు  ఐదుగురు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.. 

కేఎల్ రాహుల్:

ఆసియా కప్ 2022 టోర్నీలో వైస్ కెప్టెన్ KL రాహుల్  అద్భుతమైన స్ట్రెయిట్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. 

కేఎల్ రాహుల్:

సూపర్ ఫోర్స్ రౌండ్‌లో పాకిస్థాన్ ఆటగాడు  నసీమ్ షా వేసిన బంతిని రాహుల్ షాట్ ఆడిన  తీరు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

రిషబ్ పంత్

ఐపీఎల్ 2019 సీజన్‌లో, ముంబై ఇండియన్స్‌పై  హెలికాప్టర్ షాట్ ఆడాడు.. రిషబ్ పంత్. 

సూర్యకుమార్ యాదవ్

ఇటీవల ముగిసిన ఇండియా vs వెస్టిండీస్ T20 సిరీస్‌లో,  ఒబెడ్ మెక్‌కాయ్‌ బౌలింగ్ లో సూర్య హెలికాప్టర్  టచ్‌తో ఒక అద్భుతమైన సిక్సర్ కొట్టాడు.

లారెన్ విన్ ఫీల్డ్

జూలై 5, 2016న బ్రిస్టల్‌ వేదికగా జరిగిన ఇంగ్లాండ్,  పాకిస్తాన్ టీ20 మ్యాచులో లారెన్ విన్‌ఫీల్డ్ పర్ఫెక్ట్  హెలికాప్టర్ షాట్ ఆడుతుంది. ఈ షాట్ పై ధోని కూడా  స్పందించాడు.

రషీద్ ఖాన్

ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన కెరీర్‌లో కొన్ని  ప్రత్యేకమైన షాట్లు ఆడాడు. అందులో  హెలికాప్టర్ షాట్ కూడా ఒకటి. 

రషీద్ ఖాన్

ఇంగ్లాండ్ వేదికగా జరిగే విటలిటీ టీ20 బ్లాస్టులో  ఈ షాట్ ఆడతాడు.