జీవినశైలిలో మార్పులు, శరీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రస్తుతం ఎంతోమంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు.

ఊరికే అలసిపోవడం, అధిక రక్తపోటు, ఛాతిలో నొప్పి, మైకం లాంటివి ఈ సమస్యకు లక్షణాలు. ఇకపోతే కొన్నిరకాల ఆహారాలు, వ్యాయామంతో ఒంట్లో కొవ్వుని చాలా వేగంగా తగ్గించుకోవచ్చు.

ఆపిల్ లోని యాంటీ ఆక్సిడెంట్స్.. కొవ్వు కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 

బీన్స్ లోని మెగ్నీషియం, జింక్, ఇతర విటమిన్స్ వల్ల కొవ్వు త్వరగా తగ్గుతుంది.

బచ్చలకూరలోని మెగ్నీషియం, విటమిన్ ఇ, విటమిన్ బిలు కొవ్వు తగ్గడంలో సహాయపడతాయి.

బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఓట్స్ తినడం వల్ల 12-24శాతం వరకు చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

సార్డినెస్, సాల్మన్, మాకేరెల్ చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలం. ఇవి కొవ్వుని తగ్గించడం సహా గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బెండకాయలో కాలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొవ్వు తగ్గడానికి సహాయపడతాయి.

ఆరెంజ్ జ్యూస్ తాగితే.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

బాదం పప్పులు, వాల్ నట్స్, శనగలు లాంటి గింజలు.. ఒంట్లో కొలెస్ట్రాల్ ని తగ్గించి, గుండె జబ్బులని దూరం చేస్తాయి.

టమాటాల్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె లాంటివి శరీరంలో కొవ్వు కరిగేలా చేస్తాయి.

బొప్పాయిలోని ఫైబర్ కంటెంట్.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు హై బీపీని నియంత్రణలో ఉంచుతుంది.