తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ భవనం ఫిబ్రవరి 17వ తేదీన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది.

కేసీఆర్‌ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభి తన ఛాంబర్‌లోకి ప్రవేశిస్తారు.

ఇక, తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ప్రత్యేకతల విషయానికి వస్తే..

ఈ భవనాన్ని మొత్తం 28 ఎకరాల్లో 265 అడుగుల ఎత్తుతో నిర్మించారు.

ఒక్కో అంతస్తు ఎత్తు 14 అడుగులు. భవనంపైన ఉన్న రెండు గుమ్మటాలపై 18 అడుగుల జాతీయ చిహ్నాలు ఉంటాయి.

మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయి. ఒక్కో గేట్‌ను ప్రాధాన్యతలను బట్టి వాడనున్నారు.

లుంబినీ పార్క్‌కు ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం గుండా కేసీఆర్‌ లోపలికి వెళతారు.

6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఉండనుంది.

లోపల 300 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు ఉంచేలా పార్కింగ్‌ సౌకర్యం ఉంది.