సంక్రాంతి అనగానే కోడి పందెలు, పిండి వంటాలు గుర్తొస్తాయి. అదే టైంలో కొత్త సినిమాలు కూడా తెగ సందడి చేస్తాయి.
ఇక ఈ సంక్రాంతికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ లిస్టులో మూడు స్ట్రెయిట్ సినిమాలు, రెండు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి.
ఇక ఇందులో ఫస్ట్ ఫస్ట్.. అజిత్ హీరోగా నటించిన డబ్బింగ్ సినిమా 'తెగింపు'.. థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారమే రిలీజైంది.
గతేడాది 'వలిమై' మూవీతో హిట్ అందుకున్న అజిత్.. ఈసారి 'తెగింపు' ఎలాంటి ఫలితం అందుకున్నాడనేది తెలియాలంటే రివ్యూ చదివేయాల్సిందే.
కథ: వైజాగ్ లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో RBI రూల్స్ కి మించి రూ.500 కోట్లు ఉందని ఓ ముఠాకు తెలుస్తుంది. ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది.
కానీ సదరు ముఠా జనాలను బెదిరించే డబ్బులు దోచుకోవాలని చూస్తున్న టైంలో.. అదే బ్యాంక్ కు డబ్బులు దోచుకోవడానికి వచ్చిన మైకేల్, ముఠాకు ఎదురుతిరుగుతాడు.
కట్ చేస్తే.. అదే ముఠాతో డీల్ కుదుర్చుకుని డబ్బు కొట్టేసే క్రమంలో.. బ్యాంక్ ని పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ బృందం చుట్టుముడతారు.
మరి మైకేల్ బ్యాంక్ కొట్టేయాలని ఎందుకు అనుకున్నాడు. లిమిట్ దాటి బ్యాంక్ లో డబ్బు ఎందుకుంది అనేది తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: తమిళ హీరో అయిన అజిత్ కు తెలుగులోనూ ఓ మాదిరిగా క్రేజ్ ఉంది. అతడు నటించిన సినిమాలు డబ్బింగ్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
గతంలోనూ అజిత్ తో నెర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు తీసిన హెచ్. వినోద్.. ఈసారి 'తెగింపు' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఇక ట్రైలర్ లో చూపించినట్లు సింపుల్ పాయింట్ తో మూవీ తీసినప్పటికీ.. సమాజానికి అవసరమైన పాయింట్ నే ఇందులో డిస్కస్ చేశారు.
అయితే సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇది ఎక్కడో చూశామే అని ఫీలింగ్ ఒక్కసారైనా కలుగుతుంది. అదే టైంలో కొన్నిచోట్ల కొత్తగానూ అనిపిస్తుంది.
బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాలు, ఎంప్లాయిస్ టార్గెట్స్, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు, వడ్డీలు.. వీటితో బ్యాంకులు దోపిడీలని వేరే యాంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
క్లైమాక్స్ లో అసలు దోపిడీదారులు ఎవరు అనేది రివీల్ చేసే సీక్వెన్స్ ని కొత్తగా ప్లాన్ చేశారు. ఫుల్ యాక్షన్ మోడ్ లో ప్రీ క్లైమాక్స్ అదిరిపోతుంది. కానీ ఎండింగ్ అంతగా సంతృప్తి పరచలేదు.
బ్యాంకు చుట్టూ జరిగే సన్నివేశాలు.. విశాల్ అభిమన్యుడు, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలను, బ్యాంకు హైజాక్ అయిన సీక్వెన్సులు విజయ్ బీస్ట్ మూవీలో మాల్ సీక్వెన్స్ లా అనిపిస్తాయి.
తెగింపు సినిమా హీరో అజిత్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అవుతుంది. కానీ.. కామన్ ఆడియన్స్ కి కొన్ని విషయాల్లోనే కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
ఇక హీరో అజిత్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ బాగున్నాయి. స్టైల్, యాక్షన్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
హీరోయిన్ మంజు వారియర్, పోలీస్ క్యారెక్టర్ లో సముద్రఖని, అజయ్, విలన్ గా జాన్ కొక్కెన్ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి
తెగింపు సినిమా అంతా ఒకే రోజులో.. పలు అంశాలను టచ్ చేస్తూ సాగే స్టోరీ. డిఫరెంట్ టైమ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఒకటిగా చేసుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్.
టెక్నికల్ విషయాలకొస్తే.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ప్రెజెంట్ చేశారు.
మొత్తానికి హ్యాట్రిక్ కాంబినేషన్ గా వచ్చిన అజిత్ – వినోద్ ల యాక్షన్ డ్రామా.. మెసేజ్ ఓరియెంటెడ్ గా ఓ వర్గం ప్రేక్షకులను, అజిత్ ఫ్యాన్స్ ని మెప్పించే అవకాశాలు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే