కెప్టెన్ గా కోహ్లీ సాధించిన విజయాలపై ఎవరికీ అనుమానం లేదు. కానీ, ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అతని ఖతాలో లేదే అనే వెలితిఅంతే. ఈ వరల్డ్ కప్ తో ఆ కల తీరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో పెద్దగా రాణించింది లేదు. కానీ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్నోడు. మొదటి వరల్డ్ కప్ కావడం మరో విశేషం. ఓపెనర్ గా అతనికి అవకాశం దక్కడం ఖాయమే కావచ్చు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ మేటి అని ప్రశంసలు అందుకున్నాడు. చెన్నై నాలుగోసారి విజేతగా నిలవడంలో జడేజా పాత్ర ఎంతో ఉంది. జడ్డూ బాయ్ ఫామ్ లోకి వస్తే ఆపడం చాలా కష్టం.
సర్జరీ తర్వాత హార్దిక్ పెద్దగా ఫామ్ లో లేడు. తాజా ఐపీఎల్ లో బౌలింగ్ కూడా చేయలేదు. చివర్లో మాత్రం విధ్వంసకర షాట్లు ఆడి తనలో సత్తా అంతే ఉందని నిరూపించుకున్నాడు. ఒక్కసారి బ్యాట్ ఝళిపిస్తే ఆపడం కష్టం.
ఆఖర్లో శార్దూల్ మెయిన్ 15లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో 21 వికెట్లు తీసి షేర్ అనిపించుకున్నాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ గా టీమ్ లోకి వచ్చిన శార్దూల్ మ్యాచ్ ను తిప్పేయగలడని మెంటర్ ధోనీకి గట్టి నమ్మకం.
ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. ఇంగ్లాండ్ టూర్ లో సరైన అవకాశాలు దక్కలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20ల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో తనని నిరూపించుకున్న అశ్విన్ కచ్చితంగా రాణిస్తాడని ఆశిస్తున్నారు.
యార్కర్ కింగ్ అతనికి మరో పేరు. అతని పదునైన బంతులను ఆడటం బ్యాట్స్ మన్ కి అసాధ్యమనే చెప్పాలి. ఐపీఎల్ తరహాలో రాణిస్తే బుమ్రాను ఎదిరించడం దాదాపుగా అసాధ్యమే.
స్వింగ్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ భువీ ఈసారి ఐపీఎల్ పెద్దగా రాణించలేదు. కానీ, అతని అవసరం టీమ్ కు ఎంతగానో ఉంది అని కోహ్లీ చేసిన వ్యఖ్యలు అతడి విలువేంటో తెలియజేస్తున్నాయి.
వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయడంలో షమీ స్పెషలిస్ట్. యార్కర్లు వేయడంలోనూ అతను మేటి. ఫామ్ లోనే ఉన్న షమీ టీ20లోనూ కచ్చితంగా రాణిస్తాడనే భావిస్తున్నారు.
టీ20 జట్టులో అతడి స్థానాన్ని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శన పరంగానూ ఆ ప్రశ్నలు ఎక్కువయ్యాయి. మరి వాటిని పక్కకు తోసి ఎంత మెరుగ్గా రాణిస్తాడో చూడాలి. మరోవైపు చాహల్ కు చోటు దక్కకపోవడంపై కూడా మాజీలకు సైతం అసంతృప్తి ఉంది.
ఐపీఎల్ లో మెరుగ్గా రాణించిన వరుణ్ చక్రవర్తి మెగా ఈవెంట్ లోనూ మాయ చేస్తాడని భావిస్తున్నారు. వైవిధ్యంగా బౌలింగ్ చేయగల సత్తాఉన్న స్పిన్నర్ అవకాశం దక్కితే కచ్చితంగా నిరూపించుకోగల ప్లేయర్.
ముఖ్యంగా మెంటర్ గా మారిన ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే శార్దూల్ కు చోటు దక్కిందో అప్పుడే తన ప్రణాళికలు షురూ చేశాడని అందరికీ అర్థమైపోయింది. మెంటర్ గా ధోనీ టీమిండియాకి పెద్ద అసెట్ అనే చెప్పాలి.