టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది.
ఈ ఏడాది జూన్ 7 నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది.
టీమిండియాపై మూడో టెస్టులో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఇప్పటికై డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
అయితే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో విజయం సాధిస్తేనే భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉండేది.
కానీ, నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతున్న క్రమంలోనే భారత్ ఫైనల్ చేరిపోయింది.
ఇన్ని రోజులు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్‌తో పోటీపడిన శ్రీలంక రేస్ నుంచి తప్పుకుంది
ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో భారత్ ఓడినా డ్రా చేసుకున్న డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లేందుకు లంకకు కూడా ఛాన్స్ ఉండేది.
అందుకోసం శ్రీలంక.. న్యూజిలాండ్‌పై రెండు టెస్టు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతున్నా.. లంక మాత్రం అప్పుడే రేసు నుంచి తప్పుకుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనే శ్రీలంక ఓటమి పాలై.. టీమిండియాకు రూట్ క్లియర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది.
టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి బాల్‌కు ఫలితం రావడంతో, డబ్ల్యూటీసీ రేసు నుంచి లంక ఔట్ అయింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు ఫలితం రాకుండానే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిపోయింది.