ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు
గుండు సూది నుంచి కారు వరకు దాదాపు అన్నింటిని సామాన్యుడికి టాటా
సంస్థ అందించింది.
తాజాగా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది.
టాటా టియాగో ఈవీ అనే కారును టాటా మోటర్స్ లాంచ్ చేసింది.
ఆక్టోబర్ 10 నుంచి టాటా టియాగో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
గతంలో వచ్చిన వాటికంటే తక్కువ ధరతో టియాగో ఈవీని కంపెనీ పరిచయం చేసింది.
పెట్రోలో కారుతో 1000 కి.మీ ప్రయాణించడటానికి దాదాపు రూ. 8000 ఖర్చు అవుతోందని ఒక డేటా ద్వారా తెలిపింది.
ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు అయితే కేవలం రూ.1,100 ఖర్చు అవుతుందంట.
ఈ టియాగో ఈవీ కి 1000 కి.మీ దూరానికి రూ.1000 మాత్రమే ఖర్చు వస్తుంది.
ఆ లెక్కన కిలో మీటర్ కి ఒక రూపాయి మాత్రమే ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
టియాగో ఈవీ ని టాటా మోటర్స్ డీలర్ షిప్స్ లేదా టాటా వెబ్ సైట్ లో రూ.21 వేల డిపాజిట
్ చేసి బుక్ చేసుకోవచ్చు.
ఈ కారు డెలివరీలు మాత్రం జనవరి 2023 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ కారు ప్రారంభ ధర రూ.8.49 లక్షల ఉంటే..గరిష్ఠ ధర రూ.11.79 లక్షల వరకు ఉంటుంది.
ఇక ఈ కారులో ఐపీ67 రేటెడ్ 24KWH బ్యాటరీ, సింగిల్ ఛార్జ్ పై 315 కి.మీ రేంజ్ అందించ
ారు.
ఈ కారు మోటార్, బ్యాటరీలకు 8 ఏళ్లు వారంటీ ఉంటుంది.