టాలీవుడ్‍లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ఆ తర్వాత హీరో హీరోయిన్లుగా వచ్చినవారున్నారు. 

అయితే ఇందులో కొంత మంది మాత్రమే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నారు.

శ్రీదేవి, కమల్ హాసన్, మహేష్ బాబు, తరుణ్, రాశి వంటి వారు ఈ కోవ కిందకు వస్తారు. 

అయితే వీరిలో తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగానే కాకుండా.. ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్‌ను పొందాడు. లవర్ బాయ్‌గా అమ్మాయిలు హృదయాలను కొల్లగొట్టాడు.  

మనసు, మమతతో బాలనటుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమ్యాడు. 

అమ్మ, నాన్నల నుండి నటనను వారసత్వంగా తీసుకున్న తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో నటించాడు.

అంజలి, సూర్య ఐపిఎస్, తేజ, ఆదిత్య 369, వజ్రం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి ఫేమస్ అయ్యారు. తమిళ, మలయాళ సినిమాల్లో సందడి చేశారు. 

ఆ తర్వాత హీరోగా మారి నువ్వే కావాలితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. 

ప్రియమైన నీకు, నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే సినిమాలతో స్టార్ హోదాను సంపాదించుకున్నారు.

అయితే ఆ తర్వాత భలే దొంగలు, ఎలా చెప్పను, సోగ్గాడుతో పలు పలు సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టాయి.

2018లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. 

ఇప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్లు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒక్కడైన తరుణ్‌పై పలు రూమార్లు వచ్చాయి. పెళ్లిపై పలు ఊహాగానాలు వచ్చాయి. 

ఆ తర్వాత వ్యాపార రంగంలో బిజీగా మారారు. 

అయితే అతడి పెళ్లి, ఇతర విషయాలపై తల్లి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పారు. 

తరుణ్ కి బాగా దైవ భక్తి ఎక్కువట. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడట, చికెన్ అమితంగా తింటాడని చెప్పారు. 

తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి వెల్లడించారు.

ఓ వెబ్ సిరిస్‌తో పాటు, ఓ సినిమా చేయనున్నారని, అయితే వీటిలో ఏదీ ముందు మొదలవుతుందో అని చెప్పలేనన్నారు.

తాను కూడా మంచి సినిమా చేయాలని వెయిటింగ్ చేస్తున్నానని, తన కుమారుడు పెళ్లి చేసుకోవాలని, అన్ని బాగుండాలని ఆశిస్తున్నానని అన్నారు. 

తన చేతుల మీదుగా ఎంతో మందికి పెళ్లిళ్లు చేశానని, ఆ ఆశీర్వాదాలు తనకు కుమారుడి దక్కుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.