ఆస్కార్ అవార్డు.. ఎన్నో ఏళ్ల నుంచి భారతీయ సినిమా టాలీవుడ్ కు అందని ద్రాక్షలా మిగిలిపోయింది.
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు RRR డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి.
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు RRR డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి.
RRR సినిమాలోని నాటు నాటు పాటతో తాజాగా జరిగిన వేడుకలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ ని అందుకున్నారు.
అయితే ఈ పాటకు ఆస్కార్ వస్తుందని దాదాపు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఫిక్స్ అయిపోయాడు. అదే జరిగింది కూడా.
కానీ కొన్నిరోజుల ముందు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. ఆస్కార్ బరిలో RRR ఉండటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆస్కార్ నామినేషన్స్ లో ఉండేందుకు రూ.80 కోట్లు ఖర్చు చేశారని తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అందరూ RRR పాటకు అవార్డు వస్తుందా లేదా అని అనుకుంటున్న టైంలో తమ్మారెడ్డి ఇలా అనేసరికి అవాక్కయ్యారు.
సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు తమ్మారెడ్డి కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. ఆయన తెగ విమర్శించారు.
అయితే నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో అందరూ తమ్మారెడ్డి విషయాన్ని దాదాపు మర్చిపోయారు.
ఇలాంటి టైంలో RRR ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తమ్మారెడ్డి మరోసారి స్పందించారు. వీడియోని కూడా రిలీజ్ చేశారు.
దీంతో తమ్మారెడ్డి ఏమన్నారా అని నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపించారు. మరి ఆ వీడియోలో ఏముందో తెలుసా?
తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందం, గర్వంగా ఉందని తమ్మారెడ్డి అన్నారు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని చెప్పారు.
తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని తమ సినిమాల్లో ఇప్పటికీ స్వరపరుస్తున్న వారిలో కీరవాణి, చంద్రబోస్ ఉంటారని తమ్మారెడ్డి చెప్పారు.
కీరవాణి-చంద్రబోస్ కాంబోలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయమని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
కీరవాణి-చంద్రబోస్ కాంబోలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయమని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.