తమిళనాట ఇళయ దళపతి విజయ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విజయ్‌ కూడా రజినీకాంత్‌లా సింప్లిసిటీకి ప్రధాన్యత ఇస్తూ ఉంటారు.

తోటి మనిషితో ఎంతో ప్రేమగా ప్రవిర్తిస్తూ ఉంటారు.

అటువంటి ఆయనపై సోషల్‌ మీడియా వ్యాప్తంగా ఓ ప్రచారం జరుగుతోంది.

వారిసు సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో విజయ్‌ తన తల్లిదండ్రుల్ని అవమానించేలా ప్రవర్తించారంట.

జనవరి 2న చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్‌కు తల్లి శోభన, తండ్రి చంద్రశేఖర్‌ వెళ్లారు.

ఆ ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన విజయ్‌ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చారు.

తల్లిదండ్రులు కనిపించినపుడు ముక్త సరిగా మాట్లాడి వెళ్లిపోయారని, వారిని సరిగా పట్టించుకోలేదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై విజయ్‌ తల్లి శోభన స్పందించారు. ఆమె తాజాగా, ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ..

‘‘ అది ‘వారిసు’ సినిమా కోసం చేస్తున్న కార్యక్రమం. విజయ్‌ కోసం చేస్తున్న కార్యక్రమం. 

ఆ కార్యక్రమంలో అతడినుంచి అంతకంటే ఏమి ఆశించగలం చెప్పండి’ అని అన్నారు.

దీంతో ఆ ప్రచారానికి పులుస్టాప్‌ పెట్టినట్లు అయింది.