సార్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ధనుష్‌.

ఇది ధనుష్‌ డైరెక్ట్‌గా తెలుగులో నటించిన తొలి సినిమా.

ఈ సినిమా మంచి విజయం సాధించింది. మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించింది.

సార్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న ధనుష్‌.. మరో గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.

ఏడాది క్రితం ప్రారంభించిన తన డ్రీమ్‌ హౌస్‌లోకి గృహ ప్రవేశం చేశాడు ధనుష్‌.

చెన్నైలోని పోయేస్‌ గార్డెన్‌లో రూ. 150 కోట్ల రూపాయల ఖరీదుతో.. అన్ని హంగులతో లగ్జరీగా ఈ ఇంటిని నిర్మించాడు.

అప్పుడు ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండాలనుకున్నాడు.

కానీ ప్రస్తుతం వారు విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉంటున్నారు.

దాంతో ఈ ఇంటిని తల్లిదండ్రులకు గిఫ్ట్‌గా ఇచ్చాడు ధనుష్‌.

తాజాగా ఈ ఇంటి గృహప్రవేశం జరగింది. ఈ సందర్భంగా హోమం కూడా చేశారు.

నూతన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సార్‌ మూవీ సాధించిన విజయంతో.. తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ధనుష్‌.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ ఓ సినిమాలో నటించబోతున్నాడు.